![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకి వస్తుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. అయితే వీరికి బయట ప్రమోషన్స్ గట్టిగానే వస్తున్నాయి. తమ పీఆర్ టీమ్ లు , అభిమానులు ఓటింగ్ తో తమ కంటెస్టెంట్ ని గెలిపించాలని అనుకుంటున్నారు. అయితే ఈ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ తో ఎంతో క్రేజ్ సంపాదించుకుంటుంది.
అయితే బిగ్ బాస్ సీజన్-7 లో మీ సపోర్ట్ ఎవరికి అని సీజన్-6 కంటెస్టెంట్ ఆరోహి రావుని ఒక అభిమానిని అడుగగా.. అసలు బిగ్ బాస్ కే నేను సపోర్ట్ చేయననే స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ అమ్మడు.ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమైంది. బిగ్ బాస్ హౌస్ లో సూర్యతో కలిసి ఎక్కువ సమయం గడిపిన ఈ భామ.. ఇనయా సుల్తానా, కీర్తభట్ లతో మొదట్లో మంచి స్నేహాన్ని కలిగి ఉండేది. అయితే సూర్యతో స్నేహం మొదలయ్యాక అందరిని పక్కన పెట్టేసి సూర్య ఎక్కడుంటే అక్కడ టైం గడిపేది. ఆ రకంగా హౌస్ లో ఎంతో కొంత గుర్తింపు పొందింది ఆరోహి రావు. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది.
తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. ఆరోహి రావు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్న లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఆరోహీ వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది.
ఆరోహి తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి క్వశ్చన్ స్టార్ట్ చేసింది. ఏంటి ఈ మధ్య కనపడం లేదని ఒకరు అడుగగా.. కనపడాలని లేదని ఆరోహి అంది. వాసంతి ఎంగేజ్ మెంట్ కి ఎందుకు వెళ్ళలేదని ఒకరు అడుగగా.. తను ఇన్వైట్ చేసింది కానీ వెన్యూ డీటేల్స్ పంపడం మర్చిపోయిందని అంది. శ్రీసత్య, శ్రీహాన్ లలో ఎవరినైనా కలిసావా అని ఒకరు అడుగగా.. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరికి ఉండే ప్రియారిటీ వాళ్ళకుంటుందని రిప్లై ఇచ్చింది ఆరోహి. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఎవరు మీ ఫేవరెట్ అని అడుగగా.. అసలు బిగ్ బాస్ కే సపోర్ట్ చేయనని చెప్పింది ఆరోహి. " నువ్వు నీ ఓవారాక్షన్ ఫేస్.. పొయి అద్దంలో చూసుకో నీ ఫేస్ " అని ఒకరు అడుగగా.. చూసుకున్నా కానీ సైడ్ లో ఏదో మరక అంటుకుంది. హో అది నీ బ్రెయిన్. వెళ్ళి నీ మైండ్ సెట్ క్లీన్ చేసుకో అని రిప్లై ఇచ్చింది ఆరోహి. ఇలా ఆరోహి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానమిచ్చింది. కాగా ఇప్పుడు ఇది ఫుల్ వైరల్ గా మారింది.
![]() |
![]() |